అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నందిని అనే యువతకి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.