వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది, నిమజ్జనానికి వెళ్లి చెరువులో యువకుడు గల్లంతైన ఘటన ఖమ్మ జిల్లా ముదిగొండ మండలం మాధాపురంలో చోటుచేసుకుంది.మాధాపురానికి చెందిన 24 ఏళ్ల పడిశాల సైదారావు గ్రామంలోని చెరువులో వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి వెళ్లాడు. వినాయకుడి విగ్రహం నిమజ్జనం అనంతరం యువకుడు అక్కడే స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.