ఏలూరు శనివారపు పేట వద్ద ఒక్కసారిగా ఓ కారులో మంటలు చెలరేగాయి.. కారు ఇంజన్ భాగంలో భారీగా పొగలు వ్యాపించి మంటలు ఎగసిపడటంతో.. డ్రైవర్ గమనించి ఒక అప్రమత్తమయ్యాడు.. వెంటనే కారులో ఉన్న ప్రయాణికులను దింపివేసి మంటలను అదుపు చేశారు.. అగ్ని ప్రమాదం జరిగే సమయంలో కారు నుంచి ప్రయాణికులు బయటకు రావడం వల్ల ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు..