అనంతపురం నగర శివారులోని తపోవనం పంచాయతీ పరిధిలో ఏ ఎస్ ఆర్ నగర్ కు వెళ్లే రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీసీ రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించడంపై కాలనీవాసులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటుగా పంచాయతీరాజ్ అధికారులు తగిన చొరవతో అడ్డంగా నిర్మించిన గోడను తొలగించాలని కోరుతున్నారు.