ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కంది వారి పల్లి గ్రామంలో కంది ఎల్లమ్మ మృతి చెందారు. అదేవిధంగా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో రిటైర్డ్ టీచర్ కుందూరు రాంరెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మరియు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వారి స్వగృహం వద్దకు వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చే సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.