మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు కుంటాల రాములు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ మేరకు ఆదిలాబాద్లోని డీఈఓ కార్యాలయం ఎదుట బుదవారం ధర్నా చేపట్టారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.