అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ సమీపంలో ప్రమాదవశాత్తు కిందపడిన గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు గమనించి అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ప్రస్తుతం అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు.