కారేపల్లి మండల కేంద్రంలో సినిమా హాల్ సెంటర్ లో DYFI కారేపల్లి మండల కార్యదర్శి ఆదేర్ల.వినయ్ అధ్యక్షతన కారేపల్లి మండల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం,రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు యువతకూ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందుతున్నాయి ఆయన ఆరోపించారు.ఆగస్టు 31న ఖమ్మంలో జరిగిన డి.వై.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా మహాసభలలో నిరుద్యోగుల,యువత,విద్యార్ధుల సమస్యలపై అనేక తీర్మానాలు చేశామని, మహాసభల జయప్రదానికై సహకరించిన ప్రతి ఒక్కరికి డి.వై.ఎఫ్.ఐ జిల్లా కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.