నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే అత్యంత ప్రాధాన్యత నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే అత్యంత ప్రాధాన్యత వహిస్తాయని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ అన్నారు. శనివారం మెట్ పల్లి పట్టణంలోని పలు కూడళ్ళలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమాజ శాంతి భద్రతల దృష్ట్యా పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, కావున ప్రజల రక్షణే ధ్యేయంగా పట్టణంలోని పలు ముఖ్య కూడళ్ళలో సీసీ కెమెరాలు అమర్చినట్లు ఎస్సై పబ్బ కిరణ్ పేర్కొన్నారు.