సరూర్నగర్ చెరువు వద్ద జరుగుతున్న వినాయక నిమజ్జనాలను శనివారం మధ్యాహ్నం రాచకొండ సి పి సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాచకొండ పరిధిలో ఇప్పటివరకు మూడు వేల గణనాధులు నిమజ్జనం కాగా ఇంకా 20 వేల విగ్రహాల వరకు ఉన్నాయని తెలిపారు. వినాయక నిమజ్జనానికి రాచకొండ పరిధిలో చెరువులు కుంటల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.