చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ (22)ను నోయిడాలో అతని స్నేహితుడు దేవాన్షి పిస్టల్తో కాల్చి చంపాడు. మంగళవారం రాత్రి హాస్టల్ గదిలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, దేవాల్ష్ తన లైసెన్సుడు పిస్టల్తో దీపక్ నుదుటిపై కాల్చాడు. ఆ తర్వాత దేవాన్షి కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.బుధవారం మృతదేహాన్ని చిలకలూరిపేటలో తరలించారు.ఈ ఘటనతో చిలకలూరిపేటలోని ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.