కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు మండలం కొక్కారాయ పల్లె గ్రామంలో శ్రీ ఈశ్వర స్వామి ఆలయం పక్కనే గ్రామస్తులు శ్రీ జాంబవంత స్వామిగా పిలిచే ప్రదేశంలో శనివారం రెండు శిలా శాసనాలను జిల్లాకి చెందిన తాళపత్ర గ్రంథ లిపి నిపుణులు నాగదాసరి మునికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక శాసనం తెలుగు లిపి, తెలుగు భాషా లో రాయబడిందన్నారు.మరో శాసనం తమిళ లిపి లో రాయబడి ఉన్నట్టు గ్రామ రక్షణకు సంబంధించి మంత్ర శాసనాలుగా నిర్ధారించినట్లు తాళపత్ర గ్రంథ లిపి నిపుణులు నాగదాసరి మునికుమార్ తెలిపారు.