Download Now Banner

This browser does not support the video element.

జన్నారం: జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలని ఎంపీ నగేష్ కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

Jannaram, Mancherial | Sep 5, 2025
జన్నారం మండలంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ కు శుక్రవారం జన్నారం మండల బిజెపి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రోటిగూడ వాగుపై ఐ లెవెల్ వంతెన వెంటనే నిర్మించాలని అలాగే జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని ముప్పై పడకల ఆసుపత్రిగా అప్డేట్ చేయాలని కోరారు. అలాగే పొన్కల్ పట్టణంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టాలని ఎంపీని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు మధుసూదన్, జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య,బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us