వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలోని కస్తూర్ పల్లి, ఇందనూర్ గ్రామాల్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ గుర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం సన్నబియ్యం పంపిణీ చేయడం హర్షణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆర్ జగదీశ్వర్ రెడ్డి, మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.