సత్తెనపల్లి మండలం భీమవరం గ్రామ సచివాలయం వద్ద బుధవారం గ్రామస్తులు నిరసన చేపట్టారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని డిమాండ్ చేశారు. 'మున్సిపాలిటీ వద్దు, పంచాయతీ ముద్దు' అనే నినాదాలతో గ్రామస్థులు ఆందోళన చేశారు. నిరసనలో భాగంగా కొందరు సచివాలయం డాబాపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.