యువతకు క్రీడలతో మానసిక ఉల్లాసం లభించడంతోపాటు శరీర దారుఢ్యం పెరుగుతుందని జహీరాబాద్ డిఎస్పి సైదా అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని భాగవరెడ్డి క్రీడా మైదానంలో శ్రీనివాస్ నాయక్ పవర్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం అంతర్ రాష్ట్ర ఫుట్ బాల్ పోటీలను సీఐ శివలింగంతో కలిసి డిఎస్పి ప్రారంభించారు. పోటీల్లో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి 19 జట్ల క్రీడాకారులు పోటీలో పాల్గొంటున్నారు. కార్యక్రమంలో ఎస్సైలు వినయ్ కుమార్, రాజేందర్ రెడ్డి ,కాశీనాథ్, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం నాయకులు పాల్గొన్నారు.