పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్ లో మాజీ గవర్నర్ కొడిచేటి రోశయ్య విగ్రహం వద్ద శనివారం రాత్రి 10 గంటలకు సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బైకు ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల అతన్ని చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.