నంది నగర్ లోని కేటీఆర్ తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షలపై హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు వెళ్లి విద్యార్థుల జీవితాలను ఆగం చేయొద్దని ఆయన కోరారు. విద్యార్థులతో మీరు గద్దెనెక్కారని వారికి రాజకీయ రంగు పులమకుండా న్యాయం చేయాలని తెలిపారు. రీవాల్యుయేషన్ లేదా పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.