పలు సారా కేసులలో పట్టుబడిన మోటారు బైక్ లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్టు ఆండ్ర ఎస్సై సీతారాం తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాలూరు నియోజకవర్గం లోని మెంటాడ మండలంలో ఉన్న ఆండ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో, గతంలో నాటు సారా తరలిస్తూ పట్టుబడిన ఆరు మోటర్ బైక్ లను ఈనెల 8వ తేదీ సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామన్నారు. వేలంపాటలో వాహనాలను దక్కించుకోవాలనుకునేవారు నేరుగా ఆండ్ర పోలీస్ స్టేషన్ కు సోమవారం ఉదయం 10 గంటల లోగా రావాలన్నారు. విధిగా ఆధార్ కార్డుతో వచ్చి వాహనాలను పరిశీలించి, వేలంపాటలో పాల్గొనాలన్నారు.