పులివెందుల జడ్పిటిసి ఓటమితో పులివెందుల శాసనసభ్యుడు , మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయోమయంలో ఉన్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ విమర్శించారు . టిడిపి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మీడియాతో మాట్లాడారు.. వై రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైయస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన జగన్మోహన్ రెడ్డి.. అక్కడ పల్లె ప్రాంతంలో రోడ్డు షో చేయడం దారుణమన్నారు. పులివెందుల జడ్పిటిసి ఓటమి తర్వాత జగన్ మోహన్ రెడ్డి దిగజారి పోయారని, పట్టుమని పదిమంది లేకుండా రోడ్ షో నిర్వహిస్తున్నాడని నజీర్ చెప్పారు.