మంత్రాలయం: భారీ వర్షాలకు మండల కేంద్రానికి సమీపంలో ఉన్న నాగలదిన్నె రోడ్డు ధరివంపు వంకలో గురువారం ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా ధరివంపు వంకకు నీటి ప్రహవాం పెరిగింది. ఇబ్రహీంపురం, కొట్టాలా తదితర గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో బస్సు చిక్కుకుంది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.