గత వైసిపి ప్రభుత్వం హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి అరాచక పాలన సాగించారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శుక్రవారం టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. త్వరలోనే వైసీపీ కార్యాలయం ముందు టూలేట్ బోర్డు పెట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు.