మహబూబాబాద్ జిల్లా,పెద్దవంగర మండలం, చిన్న వంగర గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న విద్యార్థినిని టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో జాటోత్ హిందూ అనే 13 సంవత్సరాల విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .