కుప్పం మున్సిపాలిటీ డీకే పల్లి పరిధిలోని డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ మహిళలు కడ PD వికాస్ మర్మత్ను కోరారు. డీకేపల్లి పరిధిలో 46 డ్వాక్రా సంఘాలు ఉండగా గత వైసీపీ హయాంలో డ్వాక్రా సంఘాలకు సంబంధించి ప్రతినెల చెల్లించిన పొదుపు డబ్బును బ్యాంకులో జమ చేయకుండా స్వాహా చేశారని మహిళలు తెలిపారు. దీంతో కడ PD మెప్మా అధికారులతో సమావేశం అయ్యారు.