ములుగు జిల్లా కేంద్రంలో నేడు సోమవారం రోజున ఉదయం 10 గంటలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అడ్డుకునేందుకు పోలీసులు కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే సామాన్య ప్రజలను, అధికారులను, సిబ్బందిని వారి వివరాలను ఐడి కార్డులు అడిగి కార్యాలయంలోకి పంపిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.