చాకలి ఐలమ్మ 45 వర్ధంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని దోబిగాట్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం 12 10 నిర్వహించారు. ముందుగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్మున్న స్వామి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.