చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన ఒకే కుటుంబం తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి కే ఆర్ పి డ్యామ్ లోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది కుటుంబ కలహాలతో ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం కుప్పం పట్టణానికి చెందిన శారదమ్మ అల్లుడు లక్ష్మణ మూర్తి మృతి చెందారు లక్ష్మణమూర్తి భార్య జ్యోతి కుమార్తె కీర్తిక కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.