ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో నగరంలోని అనంతపురం - బెంగుళూరు జాతీయ రహదారిలో టాటా మోటార్స్ ఎదురుగానున్న స్థలంలో ఏర్పాటు చేస్తున్న రెండు హెలిప్యాడ్ లలో ఏర్పాట్లను ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి పర్యటన కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా ఎస్పీ పి.జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, తదితరులు పరిశీలించారు.ఈ సందర్భంగా మ్యాప్ ద్వారా హెలిప్యాడ్ లలో చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకుని వారు పలు సూచనలు జారీచేశారు.