ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి, వాటిని అధిక ధరలకు అమ్మడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎరువుల కృత్రిమ కొరత సరఫరా అంశాలపై సమీక్షించారు.