వినాయక పండుగను, నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు కంబదూరు తహసీల్దార్ బాలకిషన్, ఎస్ఐ ఓబులపతి సూచించారు. కంబదూరు రెవిన్యూ కార్యాలయంలో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అల్లర్లు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.