కుందుర్పి మండలం తెనగల్లు గ్రామంలో ఏకంగా తొమ్మిది మంది నిరుద్యోగులు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వ విడుదల చేసిన డీఎస్సీ ఫలితాలు తెనగల్లు యువతీ యువకులు సత్తా చాటారు. శ్రీకాంత్, జ్యోతి, లక్ష్మణమూర్తి, తేజ, భాను, నీలకంఠేశ్వరప్ప, హరీష్, గంగాధర్, సురేష్ బాబు టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈరోజు సోమవారం గ్రామస్తులు టీచర్ ఉద్యోగాలకు ఎంపికైన యువతి యువకులను శాలువాలు, పూలమాలతో సత్కరించారు.