పామిడి సమీపంలో 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్లే కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.