తాడిపత్రిలో నాయకుల నిమజ్జన కార్యక్రమం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి- టీడీపీ సీనియర్ నేత కాకర్ల రంగనాథ్ వర్గీయుల మధ్య ఆదివారం మధ్యాహ్నం నుంచి గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. లారీ, ఐచర్ వాహనంతో పాటు పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కాకర్ల వర్గీయులు ఎస్ఐ ఆంజనేయులు తో పాటు పలువురుపై రాళ్ల దాడి చేశారు. ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాత్రి అయినా ఉద్రిక్తత పరిస్థితులు సడలలేదు. కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజలు భయాందోళన చెందుతున్నారు.