ప్రకాశం జిల్లా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని మంగమూరు రోడ్డులోని గాయత్రి మందిరం ఎదురు ఉన్న రావు చెట్టును తొలగించే విషయంలో స్థానిక ప్రజలతోపాటు విశ్వహిందూ పరిషత్ సభ్యులు ధర్నాకు దిగారు. శనివారం మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించడానికి గమనించిన స్థానికులు చరిత్ర కలిగి ఎంతో కాలంగా పూజలు చేస్తున్న చెట్టును తొలగించడానికి లేదంటూ ధర్నాలు చేపట్టారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక సభ్యులకు అర్థమయ్యే విధంగా తెలియజేశారు చెట్టును పక్కనే 30 మీటర్ల దూరంలో ఉన్న గాంధీ పార్క్ లో తిరిగి నాటించారు