ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లోని సీపీఐ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పసుపులేటి వెంకయ్య నాయుడు సీపీఐ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యుడు సురేందర్ మాట్లాడుతూ, సీపీఐ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.