సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని ఏటూరునాగారం కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గ్రామపంచాయతీ EO రమాదేవి, MPDO శ్రీనివాస్ లను కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో శానిటేషన్ పనులు, దోమల మందును స్ప్రే చేయించాలని కోరారు. వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని విజ్ఞప్తి చేశారు.