నేడు మంగళవారం రోజున సాయంత్రం 5 గంటలకు మల్లంపల్లి వద్ద రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. మల్లంపల్లి – ములుగు మధ్య మల్లంపల్లి గ్రామ శివారులోని కెనాల్ పై నిర్మించిన బ్రిడ్జి ఇటీవలే కుంగిన విషయం తెలిసిందే. దీంతో రవాణా నిలిచిపోయింది. అధికారులు వాహనదారులను భూపాల్ నగర్ (పందికుంట) నుంచి మల్లంపల్లికి జాకారం నుంచి రేగొండ, పరకాల, గుడెప్పాడ్ నుంచి వరంగల్ కు మళ్లించారు. కుంగిన బ్రిడ్జిని తొలగించి రోడ్డు మరమ్మతులను చేస్తున్నారు.