వాట్సప్ గవర్నెన్స్, డోర్-టు-డోర్ సర్వేకు తమ ఐక్య వేదిక పూర్తిగా వ్యతిరేకమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మామిడికుదురు ఎంపీడీఓ జి. భవానికి వినతిపత్రం అందజేశారు. సచివాలయంలోనే ఉండి వాట్సప్ సేవలను గణనీయంగా పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వారు పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.