నారాయణఖేడ్ పట్టణంలోని తహశీల్ గ్రౌండ్‌లో 69వ ఎస్‌జీఎఫ్(స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్, సెలక్షన్ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జిల్లా స్థాయి పోటీలు నారాయణఖేడ్‌లో జరగడం ఆనందకరమని ఎమ్మెల్యే అన్నారు. మొదట ఈ పోటీలను జహీరాబాద్, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో నిర్వహించాలని ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు. నారాయణఖేడ్ లో రానున్న రోజుల్లో మరిన్ని క్రీడలు నిర్వహిస్తామన్నారు.