ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్న దోర్నాల జడ్పీహెచ్ఎస్ లో పనిచేస్తున్న హిందీ టీచర్ మండల శ్రీనివాసులు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఒంగోలులో టీచర్స్ డే సందర్భంగా శ్రీనివాసులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. పాఠశాలల అభివృద్ధికి విద్యార్థుల భవిష్యత్తుకు సొంత నిధులు వెచ్చించి చేసిన అనేక కార్యక్రమాలకు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.