కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెం గ్రామానికి చెందిన బాలాజీ ధాన్యం వ్యాపారం చేస్తూ మద్దుల మహేష్ అనే వ్యక్తికి ధాన్యాన్ని విక్రయించాడు. ఈ నేపథ్యంలో మహేష్ డబ్బులు ఇవ్వకుండా కుటుంబంతో సహా పరారీ అయిన నేపథ్యంలో బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రవీంద్ర సాంకేతిక పరిజ్ఞానంతో మహేష్ నివాసం ఉంటున్న ఇంటిని కనుగొని అతని దగ్గర నుంచి డబ్బును రికవరీ చేసి సోమవారం బాలాజీకి అందజేశారు.