వెంకటాపూర్ మండలం పాలంపేట పీఏసీఎస్ వద్ద నేడు శుక్రవారం ఉదయం నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒక ఆధార్ కార్డు మీద రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తామని సొసైటీ నిర్వాహకులు వెల్లడించడంతో రైతులు అధిక సంఖ్యలో కేంద్రం వద్దకు చేరుకొని క్యూలైన్లో ఉన్నారు. వరి పంటకు మొదటి దశ యూరియా వేసే సమయం దాటిందని, సరిపడా యూరియా అందించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.