విజయవాడలోని సితార గ్రౌండ్స్లో ప్రతిష్ఠించిన 72 అడుగుల మహా కార్య సిద్ధి మహా శక్తి డూండీ గణపతికి సంబంధించిన 72 కిలోల బాహుబలి లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. వైశ్య ప్రముఖులు, వ్యాపారులు, మార్వాడీ వ్యాపారస్తులు పోటీపడగా, అంతిమంగా ఖమ్మం వాస్తవ్యులు జవ్వాజి వెంకటేశ్వర్లు రూ. 7,20,000లకు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఈ వేలంపాటను ప్రజలు ఆసక్తిగా తిలకించారు.