కమిషనరేట్ హెడ్ క్వాటర్స్ లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం కమీషనర్ కార్యాలయంలో వినాయక విగ్రహం వద్ద పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి తొమ్మిది రోజులపాటు జరగనున్న పూజలు ప్రశాంతంగా ఇలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు జరగకుండా నిర్వహించుకోవాలని పోలీస్ వారి సూచనలు పాటిస్తూ నిమజ్జనం రోజు కూడా సహకరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ పరిధిలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.