గజపతినగరం గ్రామ సచివాలయాన్ని శనివారం మధ్యాహ్నం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వమిత్ర సర్వే, ఇంటి పన్నుల వసూలు తదితర అంశాలపై ఆరా తీశారు. పలు అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గజపతినగరం గ్రామ సచివాలయ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ డిప్యూటీ సీఈవో వెంకటరమణ, డిఎల్పిఓ, గజపతినగరం ఇన్చార్జ్ ఎంపీడీవో పుష్పలత,డిప్యూటీ ఎంపీడీవో సుగుణాకర రావు తదితరులు పాల్గొన్నారు