తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎలుకలు రావడం ఒక పేషంట్ ను సైతం కరవడంపై ప్రత్యేక అధికారి ఎన్ శ్రీధర్ గురువారం అసహనం వ్యక్తం చేశారు.ఆసుపత్రి ప్రాంగణానికి వెళ్లి ఆసుపత్రిలో ఎలకలు వస్తున్నాయా లేదా అన్న విషయంపై పూర్తిస్థాయిలో ఆరా తీశారు ఈ సందర్భంగా జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదంటూ సిబ్బందిని నిలదీశారు ఎలాంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలంటూ ఆయన హెచ్చరించారు