నల్లగొండ జిల్లా: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించే మండల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం అన్నారు. ఈ సందర్భంగా బుధవారం చిట్యాల మండల తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులు పిఓపి భూములకు సంబంధించి కేసులను పరిశీలించారు. మండలంలోని అన్ని గ్రామాల వారిగా ఏప్రిల్ 2017 నుంచి మరణించిన వారి వివరాలు తెప్పించుకుని అందులో నుంచి కుటుంబ పెద్దమ్మగా లేదా ఆడ ఎవరు చనిపోయిన అలాంటి వారి వివరాలను సేకరించాలని తెలిపారు.