మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.మాధవి అన్నారు. మంగళవారం పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సమానత్వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మ మాట్లాడుతూ ఆడపిల్లలు దేనిలో తక్కువ కాకూడదని అన్ని రంగాల్లో ముందుండి బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనాయు. తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ తల్లిదండ్రులకు, సమాజానికి, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఆడపిల్లలు 100% అక్షరాస్యత సాధించిన దేశంలో నిజమైన ప్రగతి సాధించినట్లు అని ఆమె అభిప్రాయపడ్డారు.