పల్నాడు జిల్లాలో యూరియా కొరత అనేది వైసిపి తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే బొల్లా తదితరులు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రైతులు వాస్తవాలు గమనించాలని కోరారు.