రామాయంపేట మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ క్రీడలు ప్రారంభమయ్యాయి. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పోటీలను ఎంఈఓ శ్రీనివాస్ ప్రారంభించారు. మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తామని, మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎసీఎఫ్ క్రీడా పోటీల్లో 16 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొంటున్నారని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.